రివ్యూలుసినిమా
Trending

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? యాంకర్ ప్రదీప్ హవా ఎలా ఉందంటే??

యాంక‌ర్  ప్రదీప్‌ మాచిరాజు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?.

అర్జున్ (ప్రదీప్‌ మాచిరాజు), అక్షర (అమృత అయ్య‌ర్‌) ఒకే కాలేజీలో చ‌దువుకుంటుంటారు.  ప‌క్క ప‌క్క ఇళ్లల్లోనే ఉంటారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. అవ‌కాశం దొరికితే చాలు… టామ్ అండ్ జెర్రీలా ఒక‌రినొక‌రు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఒక సంద‌ర్భంలో కాలేజీ స్నేహితులంతా క‌లిసి అర‌కు టూర్‌కి వెళ‌తారు.

అక్కడికి వెళ్లాక కూడా ఇద్దరూ గొడ‌వ ప‌డ‌తారు. ఈ క్రమంలోనే అర్జున్‌, అక్షర ఇద్దరూ ఒక‌రి శ‌రీరంలోకి మ‌రొక‌రు ప్రవేశిస్తారు. అలా శ‌రీరాలు మారిపోవ‌డానికి గ‌త జ‌న్మ ప్రభావం ఉంటుంది. ఇంత‌కీ గ‌త జన్మలో ఏం జ‌రిగింది? అప్పట్లో అర్జున్‌, అక్షర ఎవ‌రు? మ‌రి వీళ్లిద్దరూ వాళ్ల వాళ్ల శ‌రీరాల్లోకి తిరిగి వ‌చ్చారా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.97 కోట్లు.

ఆకట్టుకొన్న మ్యూజిక్, సినిమాటోగ్రఫి

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెర మీద కూడా పాట ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కలిగిస్తుంది. అలాగే మాస్ బీట్‌తో సాగే మామ పాట కూడా ఆకట్టుకొంటుంది. అనూప్ రూబెన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఎడిటింగ్ విషయానికి వస్తే కార్తీక్ శ్రీనివాస్ ఇంకా చేతినిండా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

Watch 30 Rojullo Preminchadam Ela Full Movie Directed by Munna Dhulipudi, Starring Pradeep Machiraju, Amritha Aiyer, Which Is Released In The Year 2021

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button