టాలీవుడ్సినిమా
Trending

కొణిదెల వారి పెళ్ళికి ఫ్యామిలీతో బయలుదేరిన అల్లు అర్జున్

నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటున్నారు మెగా కుటుంబ సభ్యులు. ఈ నెల 9న నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

నిహారిక వివాహానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు మొత్తం రాజస్థాన్ ఉదయపూర్ కు చేరుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ పయనం అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.

నేడు మెగా కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్, నాగబాబు, పెళ్ళి కూతురు నిహారికా, వరుడు చైతన్యా ఫ్లైట్‌లో రాజస్థాన్ ఉదయ్ పూర్‌కు బయలుదెరారు. దీనికి సంబంధించిన ఫోటోను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోలో వరుడు చైతన్య ఫోటో క్లిక్‌మనిపించాడు. దీంతో మెగా అభిమానులు వివామవేడుక సందర్బంగా నిహారికను విష్ చేశారు.

నిహారిక పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు, తన తల్లి పద్మ నిశ్చితార్థ చీరలో నిహారిక పెళ్లి కుమార్తెగా మెరిసిపోయారు. నిహారికను పెళ్లి కూతురిని చేసిన అనంతరం ఎమోషన్ కి గురయ్యారు మెగాబ్రదర్ నాగబాబు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button