
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలోకి వెళ్తే, టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అర్జున్ రెడ్డి ఫేమ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ భావించాడు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి స్టైలిష్ గాగుల్స్‌తో పాటు రౌడీ హీరో బ్రాండ్ దుస్తులు కూడా గిఫ్ట్‌గా అందించాడు విజయ్ దేవరకొండ.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తన అభిమానులకు తెలిసేలా చేశాడు బన్నీ. తనకు కూల్ పెయిర్ గిఫ్ట్‌గా ఇచ్చిన సోదరుడు విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్‌కు థ్యాంక్స్ అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫాన్స్ ఆనందం వక్తం చేటున్నారు. హీరోల మధ్య మంచి రిలేషన్ ఉందంటూ బన్నీ ఫ్యాన్స్, రౌడీ హీరో ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బన్నీకి విజయ్ పంపించిన గాగుల్స్, రౌడీ బ్రాండ్ డ్రెస్ వేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రౌడీ హీరో పంపిన స్పెషల్ కలెక్షన్ లో బన్నీ మరింత సూపర్ స్టైలిష్ గా ఉన్నాడని అంటున్నారు నెటిజన్స్. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటులను తీసుకున్నాడు. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.