ఆంధ్రప్రదేశ్వార్తలు
Trending

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబు అమరావతి పర్యటను ఉద్రిక్తంగా మారింది..

రైతుల ఆందోళన ఏడాది పూర్తైన సందర్భంగా జనభేరి పేరుతో రాయపూడి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వెళుతుండగా వెలగపూడి దగ్గర చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాయపూడి సభ ప్రాంతానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలెం నుంచి ఉద్యమం జరుగుతున్న గ్రామాల మీదుగా రాయపూడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సభా వేదికకు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందు చంద్రబాబు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి దేవతల రాజధాని. ఐదు కోట్ల మంది తరఫున అమ్మవారిని ప్రార్థించాను అన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుకున్నానని.. న్యాయం, ధర్మం గెలుస్తుందని విశ్వసిస్తున్నాను అన్నారు. దేవతల రాజధానిని విధ్వంసం చేస్తుంటే ఆ తల్లే రక్షణగా నిలవాలన్నారు. ఏడాది నుంచి రాజధాని కోసం ఆందోళనలు చేస్తుంటే ఎన్నో అడ్డంకులు సృష్టించారని.. దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన వారిని సైతం అడ్డుకునే పరిస్థితి ఉందన్నారు.

చంద్రబాబు రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బాబు మాత్రం శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లి తీరుతాను అన్నారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమలు వాగ్వాదానికి దిగారు. బహిరంగ సభకు అనుమతి ఉన్నా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అనుమతించిన దారిలో కాకుండా వేరే రూట్‌లో వెళ్తానని చంద్రబాబు అన్నారు.. వేరే దారిలో వెళ్తే భద్రతా సమస్యలు వస్తాయంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు అనుమతించడంతో చంద్రబాబు ఉద్దండరాయుని పాలెం వెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button