
షో నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్‌కు హోస్ట్ నాగార్జున సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అవినాష్ ఇంటికి పంపారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఒక వారంతం నాగార్జున వేసుకొచ్చిన షర్ట్ చాలా బాగుందని ఆయనతోనే అవినాష్ అన్నాడు. ఆ షర్ట్‌ను ఇప్పుడు అవినాష్‌కు ప్రేమతో పంపారు నాగార్జున. ఈ విషయాన్ని అవినాష్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాగార్జున పంపిన షర్ట్ వేసుకుని ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి మురిసిపోయాడు. ‘‘షర్ట్ బాగుంది బాబు గారు అని చెప్తే గుర్తు పెట్టుకుని మరీ ఇంటికి పంపారు. లవ్ యు సార్’’ అని అవినాష్ పేర్కొన్నాడు.

అయితే, అవినాష్‌ను మోనల్ కాలితో తన్నడం, అది పెద్ద రచ్చ అవ్వడం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సీన్ తరవాత అవినాష్‌కు సింపథీ వర్కౌట్ అయ్యి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడేమో అని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. అవినాష్ ఎలిమినేషన్‌పై విమర్శలు కూడా వచ్చాయి. మోనల్‌ను కావాలనే సేవ్ చేసి అవినాష్‌కు అన్యాయం చేశారని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది.

మోనల్ ఎలిమినేషన్
ఈ సీజన్లో చివరి 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో ఇంటి సభ్యుల్ని అందర్నీ నామినేషన్స్‌లోకి నెట్టారు బిగ్ బాస్. అయితే అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించడంతో డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్లారు. దీంతో హారిక, సొహైల్, అభిజిత్, అరియానా, మోనాల్‌లు 14 వ వారంలో నామినేట్ అయ్యారు. అయితే మోనాల్‌ని ప్రతివారం ఎలాగైనే రక్షిస్తున్నారో.. ఈవారం ఆమెను సేవ్ చేసి హారికను ఎలిమినేట్ చేయబోతున్నట్టుగా ప్రచారం నడిచింది.

అయితే ఈవారం ఓటింగ్‌లో మోనాల్‌కి తక్కువ ఓట్లు పడ్డాయో.. లేక బిగ్ బాస్ మనసు మారిందో తెలియదు కానీ.. మోనాల్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి మోనాల్ హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ సార్లు నామినేట్ అయ్యింది. నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి చివరి వరకూ వెళ్లి.. చివర్లో సేవ్ అవుతూ వస్తోంది. దాదాపు ప్రతివారం ఇదే తంతు. అవినాష్, కుమార్ సాయి, దేవి, స్వాతి, దివి, లాస్య ఇలా బలమైన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు తప్పితే మోనాల్ మాత్రం సేవ్ అయ్యేది.

దీంతో మోనాల్‌ని బిగ్ బాస్ రేటింగ్ కోసం కావాలని సేవ్ చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి. నిజానికి ఈ సీజన్లో ఓటింగ్ విషయంలో ప్రేక్షకులకు క్రెడిబిలిటీ పోయింది అంటే.. అది మోనాల్ వల్లే అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఇక మోనాల్‌ని ఎలిమినేట్ చేయడం ప్రేక్షకుల వల్ల కాదని.. అది బిగ్ బాస్ చేతుల్లోనే ఉందని జనం ఫిక్స్ అయిపోయేంతగా మోనాల్‌ని సేవ్ చేస్తూ వచ్చారు బిగ్ బాస్.

ఆ విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఈ సీజన్లో ఆట మొత్తం మోనాల్‌పైనే నడిచింది. ఆమె గ్లామర్, ఎఫైర్లను బాగా వాడుకుని రేటింగ్ రాబట్టారు బిగ్ బాస్. అటు అఖిల్, ఇటు అభిజిత్ ఇద్దరితోనూ లవ్ ఎఫైర్ సాగించిందని బిగ్ బాస్‌కి సాధ్యమైనంత ఎక్కువగా ఆమెను ప్రమోట్ చేశారు.
మోనాల్‌కి వ్యక్తిగతంగా బ్యాడ్ వచ్చినా.. ఈ విషయలో రేటింగ్ మాత్రం బాగానే దండుకున్నారు. ఈ సీజన్లో రేటింగ్ వనరు మోనాల్ అని చెప్పక తప్పదు. మోనాల్ గ్లామర్‌ని ఏడుపుని రొమాన్స్‌ని విరివిగా వాడేశారు బిగ్ బాస్.