బుల్లితెరసినిమా

Bigg Boss 4 Elimination: బిగ్‌బాస్ 4.. అవినాష్ ఈవారం ఎలిమినేట్ అయ్యాడా???

బిగ్‌బాస్ 4 తెలుగు 13వ వారాలు పూర్తి చేసుకోవటం తో 5లో ఎవ‌రు ఉండ‌నున్నార‌నే దానిపై మ‌రింత క్లారిటీ ఈ వారం ద‌క్క‌నుంది. గ‌త వారం అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడ‌కుండా సేవింగ్ పాస్‌తో బ‌తికిపోయాడు. మ‌రి ఈ వారం ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే ప్ర‌తి వారంలాగానే ఈ వారం కూడా బిగ్‌బాస్ ఎలిమినేట‌ర్ ఎవ‌ర‌నేది ముందుగానే లీక్ అయిందని వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు బిగ్‌బాస్ హౌస్ నుండి హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎలిమినేట్ అవుతుంద‌ని టాక్‌. అఖిల్‌, అభిజీత్‌, అవినాష్‌, హారిక‌, మోనాల్ నామినేష‌న్స్‌లో ఉన్నారు.

Monal Bigg Boss 4 Telugu
Monal Bigg Boss 4 Telugu

నిజానికి మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. బిగ్‌బాస్ ఆమెను ఏదో ర‌కంగా సేవ్ చేస్తూ వ‌స్తున్నాడు. అందుకు కార‌ణ‌మేంటో కూడా తెలుసు. అఖిల్‌, అభిజీత్‌, మోనాల్ మ‌ధ్య ర‌న్ అయిన ల‌వ్‌ట్రాక్‌.. దాని వ‌ల్ల వ‌చ్చిన గొడ‌వ‌లు బిగ్‌బాస్ హౌస్‌లో కాసింత ఆస‌క్తిని క‌లిగించాయి. ఆమె ముందే వెళ్లిపోతే కిక్ పోతుంద‌ని భావించిన బిగ్‌బాస్ ఆమెను కాపాడుతూ వ‌చ్చాడు. ఎలాగూ ఇక ఫైన‌ల్ ద‌శ‌కు వ‌చ్చేశాం కాబ‌ట్టి.. ఇక‌పై గేమ్‌పైనే ఆధార‌ప‌డి ముందుకెళ్లాల్సి ఉంటుంది, అందుక‌నే మోనాల్‌కు మంగ‌ళం ప‌ట్టేశాడు బిగ్‌బాస్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఈవారం కూడా బిగ్‌బాస్ మోనాల్ ని సేవ్ చేసాడని, అవినాష్ ని ఎలిమినతె చేసారని సమాచారం.

నిజానికి ఈ బిగ్‌బాస్ ప్ర‌యాణంలో మోనాల్‌ ఎన్నోసార్లు నామినేట్ అయినప్ప‌టికీ ఎలాగోలా ఆ గండం నుంచి త‌ప్పించుకుంటూ వచ్చింది. కొన్నిసార్లైతే ఆమెను సేవ్ చేయ‌డం కోసం ఎక్కువ ఓట్లు వ‌చ్చిన‌ స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను బ‌య‌ట‌కు పంపించార‌న్న ఆరోపణ‌లు కూడా ఉన్నాయి. ఈ వారం అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, మోనాల్ నామినేష‌న్‌లో ఉండ‌గా ఎప్ప‌టిలాగే మిస్ట‌ర్ కూల్ ఎక్కువ ఓట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. చివ‌రి రెండు స్థానాల్లో మోనాల్‌, అవినాష్ ఊగిస‌లాడారు. మోనాల్ ఎలిమినేట్ అయిందా?  లేదా అవినాష్‌ను పంపించేశారా? అనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కు వేచి చూడాల్సిందే!

Watch Latest Movies Streaming Online

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button