బుల్లితెరసినిమా
Trending

త‌ప్ప‌కుండా విన్న‌ర్ అవుతా: అఖిల్‌ కాన్ఫిడెన్స్‌

బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడించిన టాస్కుల‌కు సంబంధించి అన్ని వ‌స్తువుల‌ను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ముందుగా అఖిల్‌ను పిలిచి అత‌డి జ‌ర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో మోనాల్‌తో ఆట‌పాట‌లు, అభితో గొడ‌వ‌లు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్‌ కంట‌త‌డి పెట్టుకున్నాడు. త‌ను ఎఫ‌ర్ట్స్ పెట్టి ఆడాన‌ని అఖిల్ మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. గెలుపోట‌ములు త‌న‌ చేతిలో లేవ‌ని, కానీ ప్ర‌య‌త్నం మాత్రం ఎప్ప‌టికీ మానుకోలేద‌ని చెప్పాడు.

Bigg Boss Telugu 4
Bigg Boss Telugu 4

తోడు కోసం ప‌రిత‌పించాను కానీ ప్రేక్ష‌కుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వ‌చ్చిన‌ప్పుడు ఇంకా ప్రేమ కావాల‌నుకోవ‌డం ఫూలిష్‌నెస్ అనిపిస్తోంద‌న్నాడు. త‌న‌కీ ప్రేక్ష‌కుల ప్రేమ చాలు అంటూ మోకాళ్ల‌పై మోక‌రిల్లి ఓట్లేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. బిగ్‌బాస్ వ‌ల్ల‌ తనేంటో త‌న‌కు తెలిసింద‌ని, త‌ప్ప‌కుండా విన్న‌ర్ అవుతానన్న న‌మ్మ‌కం ఉంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు. అనంత‌రం బాల్క‌నీలో ఉన్న త‌న ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్ర‌వేశించాడు.

bigg bosst elugu 4
Akhil Bigg Boss 4 Telugu
Akhil Bigg Boss 4 Telugu

Watch 2020 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button