
చూస్తుండగానే బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమై పదమూడు వారాలు గడిచిపోయాయి. గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాలే మిగిలే ఉన్నాయి. ట్రోఫీ అందుకోవాలన్న కసితో కంటెస్టెంట్లు ఆట మీద విరుచుకుపడుతున్నారు. ఎమోషన్స్, గేమ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆడుతున్నారు. మరోవైపు అఖిల్ ఇప్పటికే నేరుగా ఫినాలేకు చేరుకుని గుండెల మీద చెయ్యేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్లో ఉండనున్నారు. ఇదే చివరి నామినేషన్ అని స్పష్టం చేస్తూ బిగ్‌బాస్ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.

అఖిల్-సొహైల్‌లు బిగ్ బాస్ హౌస్‌లో ఇద్దరు మిత్రుడు. ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట.. వీళ్ల త్యాగాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మ నన్ను కెప్టెన్ అవ్వాలని అనుకుందిరా.. కానీ కాలేకపోయాను. మా అన్నయ్య నన్ను ముందు టాప్ 5లో పెట్టలేదు.. ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మదర్ సెంటిమెంట్‌తో కొట్టడంతో టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కరిగిపోయాడు సొహైల్.

అఖిల్ సెంటిమెంట్‌తో కొట్టడంతో సొహైల్ పెద్ద త్యాగమే చేశాడు. ఉయ్యాలపై నుంచి తిగిపోయి.. తాను ఓడిపోయి అఖిల్‌ని గెలిపించాడు. అయితే అలా ఉంటే బిగ్ బాస్ ఆటలో మజా ఏం ఉంటుంది. ఉన్న రిలేషన్స్‌ని కట్ చేయడం.. లేని ఎమోషన్స్‌ని కల్పించడమే కదా బిగ్ బాస్ ఆట.. ఇప్పుడు అఖిల్-సొహైల్‌ల మధ్య కూడా పెంట పెడుతున్నారు బిగ్ బాస్.
బిగ్ బాస్ రాజ్యానికి రాణిగా ఉన్న హారిక తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ‘అభిజిత్, సొహైల్.. నేను పిలుస్తున్నా.. పది సెకన్లలో రాకపోతే.. మీ బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాయని బెదిరించింది. వాళ్లిద్దరూ ఆమెను పట్టించుకోకపోగా.. బట్టలు పడేయనీ చుక్కుల చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చాడు సొహైల్. అయితే హారికకు సేవకుడిగా ఉన్న అఖిల్.. వీళ్ల బట్టలు తెచ్చి హారికకు ఇవ్వడంతో హారిక వాళ్ల బట్టల్ని స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది.

దీంతో సొహైల్లోని ఆవేశం కట్టలు తెంచుకుంది.. అర్జున్ రెడ్డి బయటకు వచ్చేశాడు. అఖిల్‌తో గొడవకు దిగాడు.. బరాబర్ ఇలాగే మాట్లాడతా అని.. లోపలికి వెళ్లి కుర్చీలను తన్నేస్తూ.. పడేస్తూ నానా హడావిడి చేస్తున్నాడు. అయితే అభిజిత్ సొహైల్‌ని కూల్ చేస్తూ కనిపించాడు.
కథ వేరే ఉంది –
కోపం తగ్గించుకోరా బాబూ అంటూ బిగ్ బాస్ 4 తెలుగులో సోహెల్‌కు ఎంత మంది చెప్పినా పెడచెవినా పెడుతూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు తగ్గించుకున్నట్లే కనిపిస్తాడు కానీ లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంటుంది. ఏదో కారెక్టర్ కొత్తగా ఉందని అప్పుడప్పుడూ కూల్ సోహెల్ బయటికి వస్తుంటాడు. కానీ అవసరం వచ్చినపుడు మళ్లీ ఒరిజినల్ కారెక్టర్ వద్దన్నా తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది.

కోపం తగ్గించుకో అని ఇంటి సభ్యులు చెప్పారు.. నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు.. ప్రాణ స్నేహితుడు మెహబూబ్ చెప్పాడు.. ఇంతమంది చెప్పినా కూడా సోహెల్ మాత్రం మారడం లేదు. కూల్‌గా ఉన్నట్లే కనిపిస్తాడు కానీ అప్పుడప్పుడూ రెచ్చిపోతుంటాడు.
సోహెల్, అభిజీత్ బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. దాంతో మనోడికి కోపం నషాలానికి అంటింది. వెంటనే లోపలికి వెళ్లి అక్కడున్న కుర్చీని నేలకేసి కొట్టాడు సోహెల్. అది కాస్తా మనోడి పవర్‌కు మూడు నాలుగు పల్టీలు కొట్టింది. పక్కనే అభిజీత్ వచ్చి ఎంత కూల్ చేయాలని ప్రకత్నిస్తున్నా కూడా వినడం లేదు సోహెల్. మరి అంత కోపం ఎందుకొచ్చింది.. ఇదంతా గేమ్‌లో భాగంగానే చేస్తున్నాడా లేదంటే నిజంగానే ఈయనకు అంత కోపం వచ్చిందా అనేది ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది.