బుల్లితెరసినిమా

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ..! ఒక రేంజ్ లో ఉంటుందా?

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోరాడారు. చివ‌రికి ఐదుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. హారిక‌, అరియానా, సోహైల్‌, అభిజిత్‌, అఖిల్.. ఎవ‌రికి వారు విజేత‌గా నిల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రో మూడు రోజుల్లో గెలుపోట‌ములుఖ‌రారు కానున్నాయి. మ‌రి డిసెంబ‌ర్ 20న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న‌ గ్రాండ్ ఫినాలేను ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత గ్రాండ్‌గా ఏర్పాటు చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజేత‌ను ప్ర‌క‌టించేందుకు స్టార్ హీరోను తీసుకురావ‌డంతో పాటు, అంద‌మైన‌ భామ‌ల‌తో డ్యాన్సులు చేయించ‌నున్నారు. ఇప్ప‌టికే స్పెష‌ల్ గెస్ట్‌ను ర‌ప్పించేందుకు బిగ్‌బాస్ టీమ్ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

ప్రస్తుతం ఇండియాలో సాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు, హిందీ, తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో సక్సస్ ఫుల్ గా సాగుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 13 వ సీజన్ సాగుతుండగా తెలుగు, తమిళంలో సీజన్ 4 సక్సస్ ఫుల్ గా కంప్లీట్ కాబోతోంది. కాగా తమిళంలో ఈ సీజన్ 4 కి లోకనాయకుడు కమల్ హాసన్.. మన తెలుగులో కింగ్.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి మంచి టీఅర్‌పి రేటింగ్ తో సాగుతోంది.

గత సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులని ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి ఈసారి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ని తీసుకురాబోతున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలే లో ఆ సినిమాల విషయాలను కూడా పంచుకునే అవకాశం ఉంటుందన్న ప్రేక్షకుల స్ట్రాటజీ ని బాగా ఉపయోగించుకోవాలన్న ప్లాన్ తో ఇలా మెగాస్టార్, ఎన్,టి.ఆర్ లని తీసుకు రాబోతున్నట్టు సమాచారం. ఇక టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలుస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మెగాస్టార్ ఎంట్రీకి ఒక హీరోయిన్, ఎన్.టి.ఆర్ ఎంట్రీకి ఒక హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. వారే మెహ్రీన్, రాయ్ లక్ష్మీ.

Watch 2020 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button