అంతర్జాతీయంవార్తలు
Trending

400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ‘క్రిస్మస్‌ స్టార్‌’

సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్‌ స్టార్‌’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్‌ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్‌ స్టార్‌’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు.

డిసెంబర్ 21 రాత్రి గురు, శని గ్రహాల అరుదైన కలయిక.. ‘స్టార్ ఆఫ్ బెత్లెహం’

గురు గ్రహం (జూపిటర్), శని గ్రహం (సాటర్న్) తమ తమ కక్ష్యల్లో ప్రయాణిస్తూ మెల్లగా ఒకదానికి ఒకటి చేరువగా వస్తున్నాయి. డిసెంబర్ 21 రాత్రి ఈ రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటి వెళతాయి. ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చు.

“సాయంత్రం పూట ఆకాశంవైపు చూస్తే ఆ రెండు గ్రహాలు దగ్గరగా వస్తున్న సంగతి తెలుస్తుంది. వాతావరణం ఎప్పుడు, ఎలా మారుతుందో తెలీదు కాబట్టి వెంటనే చూస్తే మేలు. మంచి అవకాశం కోల్పోకుండా ఉంటాం” అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన డా. కరోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే, సూర్యుడు చుట్టూ నిత్యం తిరిగే గ్రహాలు ఒకదానిని ఒకటి క్రాస్ చేసుకోవడం అనేది తరచూ జరిగేదే. కానీ ఈ సంయోగం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంగా వస్తున్నాయి.

Watch 2020 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button