
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే గత రాత్రి టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ‘డీఆర్50‘ పేరిట ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పవన్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, సమంత, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, కన్నడ హీరో యశ్ వంటి అగ్రతారలు దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.


హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో అగ్ర హీరోల నుంచి హీరోయిన్ల వరకు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాన్, రామ్‌చరణ్, ప్రబాస్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, రాక్‌స్టార్ యశ్, కేజీఎఫ్ చిత్ర యూనిట్, రామ్ పోతినేని, బెల్లంకొండ సురేష్ మెరిశారు. అదే విధంగా అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరణ్, నివేదా పేతురాజ్ తమ బ్యూటిఫుల్ అందాలతో కనువిందు చేశారు. మరోవైపు సెలబ్రిటీ కపూల్స్, సమంత- చైతన్య, నితిన్ తన భార్యతో కలిసి రావడం విశేషంగా నిలిచింది. వీరంతా ‘దిల్ రాజు 50’ అనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పార్టీకి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


















