బుల్లితెర
Trending

కార్తీకదీపం: దీపని దెబ్బకొట్టడానికి ఎత్తుకు పైఎత్తులు.. కార్తీక్ మరో ప్లాన్!

సౌర్య బట్టలు కంగారు కంగారుగా సద్దుకుంటూ ఉంటుంది. ‘అత్తమ్మా ఇవన్నీ ఎక్కడికి?’ అంటుంది దీప. ‘నేను నాన్నతో ఆ ఇంటికి వెళ్తున్నానమ్మా..’ అంటుంది సౌర్య. దీపతో పాటు హిమ, శ్రావ్య, మురళీ కృష్ణలు కూడా షాక్ అవుతారు. ‘వద్దులే అత్తమ్మా.. మీ నాన్న ఏం అంటారో’ అంటుంది దీప. ‘నాన్నే బట్టలు సద్దుకుని రా అన్నాడు’ అంటూ సౌర్య శ్రావ్య చేయి పట్టుకుని ‘పిన్నీ రా వెళ్దాం’ అంటూ బయలుదేరుతుంది.

సౌర్యతో పాటు ఇంటికి తన ఇంటికి వస్తాడు కార్తీక్. శ్రావ్య కూడా ఉంటుంది. సౌర్యని చూసిన ఆనందరావు.. ‘సౌర్యని..’అంటాడు అనుమానంగా చూస్తుంటే.. ‘రౌడీ ఇక్కడే మనతో రెండు రోజులు ఉంటుంది..’ అంటాడు కార్తీక్. దాంతో సౌందర్య, ఆనందరావు ఇద్దరూ షాక్ అవుతారు. కానీ ఆదిత్య నవ్వుతూ సౌర్య బ్యాగ్ తీసుకుని హ్యాపీగా లోపలికి తీసుకుని వెళ్తాడు. తర్వాత కార్తీక్ సౌందర్య, ఆనందరావులతో.. ‘నా కూతుర్ని అది తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టుకుంది కదా..ఇప్పుడు దాని కూతుర్ని నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే.. నేను పడే బాధేంటో దానికీ తెలిసొస్తుంది.’ అంటాడు కార్తీక్. సౌందర్య, ఆనందరావులు షాక్ అవుతారు.

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు 950 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రేపటి ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. నేటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. కార్తీక్ హిమని కలుసుకున్నాడు. సౌర్య మాటలకు అతడి మనసు కరిగిపోయింది. దాంతో కథ ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కార్తీక్ సౌందర్య, ఆనందరావులని ఓ రిక్వస్ట్ చేశాడు. ‘రెండే రెండు రోజులు నాకు సపోర్ట్‌గా ఉంటారా..? దీపని పట్టించుకోకుండా ఉంటారా?’ అని అడిగాడు. అయితే వాళ్లు ఒప్పుకోలేదు కానీ.. కార్తీక్ ఏదో ప్లాన్‌లో ఉన్నాడని అర్థమవుతుంది. అసలు ప్లాన్ ఏంటో తెలియదు కానీ.. నేడు కార్తీక్ ప్రయత్నించకుండానే.. మరో అవకాశం కార్తీక్‌కి వచ్చింది. దీపని ఏడిపించడానికి, ఎమోషనల్‌గా దెబ్బతియ్యడానికి దాన్నే ఆయుధంగా మార్చుకోనున్నాడు డాక్టర్ బాబు. నేటి ఎపిసోడ్ హైలైట్స్ మిస్ అయ్యారా? అయితే ముందుగా కింద ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి.

Watch 2021 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button