బుల్లితెరసినిమా
Trending

కార్తీకదీపం 955 ఎపిసోడ్‌ హైలైట్స్..

Karthika deepam serial today – 955 ఎపిసోడ్‌ హైలైట్స్..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్..

‘ఇది మన సమస్య దీపా.. ఇందులోకి పిల్లల్ని లాగొద్దు.. ఆ రౌడీ కూడా తండ్రి ప్రేమ కోసం తపిస్తోంది.. చిత్రంగా దాని మీద కోపం రావట్లేదు.. జాలేస్తోంది.. జాలిలోంచి తండ్రి పుట్టుకురాడు.. నమ్మకంలోంచే తండ్రి పుడతాడు.. అది పుట్టక ముందే ఆ నమ్మకం పోయింది.. నేను బాగా అలసిపోయాను దీప.. మనసు అలసిపోతే ఏం మందులుంటాయి..? అసలిన మనసులో ఆశలు ఎలా ఉంటాయి?’ అంటాడు కార్తీక్.

దాంతో దీప.. ‘ఇప్పుడు నాకు పిల్లలు భవిష్యత్ గురించే బెంగపట్టుకుంది. దానికి కారణం నేనంటాను.. కాదు నువ్వని మీరంటారు.. మీకు మీ మీద ఉన్న నమ్మకం వైద్యశాస్త్రం మీద లేదు.. నాకు నా మీద నమ్మకం తప్ప రుజువుకు ఎలాంటి శీలపరీక్షలు లేవు. దీనికి కారణం కాలమా? గాయమా? అనుమానమా? అపనమ్మకమా? నేనేనా? మీరేనా?’ అంటుంది దీప బాధగా.

హిమ చనిపోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది దీపా.. అప్పుడు నా ప్రేమ, నా వ్యక్తిత్వం.. అవన్నీ అలానే ఉండేవి. ఇప్పటి నేను నేను కాదు దీపా.. అప్పడప్పుడు నీ విషయంలో కూడా అలాగే అనిపిస్తోంది.. అప్పటి నీ ఆత్మ సౌందర్య అలాగే ఉంటే ఎంత బాగుండేది అని..

ఈ సంగర్షణ అంతా కల అయితే అందరి జీవితాలు బాగుండేవి కదా అనిపిస్తోంది దీపా’ అంటాడు కార్తీక్ చాలా నిరాశగా. ‘మీరు అబద్దం అనేది నిజం.. నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే.. కావాల్సింది నా మీద నమ్మకం.. ఆ నమ్మకం కలగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. కానీ మీరు ఏ ప్రయత్నం చేయట్లేదు..’ అంటుంది దీప.

‘ఇప్పుడు ఈ మాటలన్నీ చెబుతున్నావ్.. మరింట్లోంచి వెళ్లిపోయేప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు.. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను..మీరంతా నేను అజ్ఞ‌ానంలో కొట్టుకుపోతున్నా అనుకుంటున్నారు కదా.. ఈ మధ్య ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావ్ కానీ.. ఇదేదో నా ఇంటి గడప దాటకమునుపే.. పదేళ్ల కిందే చేసి ఉండొచ్చుకదా.. నేను నీ పక్కనే ఉన్నాను..

అప్పుడు నీలో కవిత్వం మాత్రమే ఉంది.. నేను నీ ప్రేమని కోరుకున్నాను.. నువ్వు కవిత్వ ప్రవాహంలో కొట్టుకునిపోతున్నావ్.. ఆ ప్రవాహాన్ని ఆపడానికి నీకు తీరిక లేదు..చూస్తూ భరించే ఊపిక నాకు లేదు.. జరగాల్సిందంతా జరిగిపోయింది.. నువ్వేం సాధించావ్?? నాలో అనుమానం మొదలుకాగానే నేను చేయించుకోవాల్సిన పరీక్షలు చేయించుకున్నాను. నిర్ధారణ అయ్యాక అందరి ముందు బయటపెట్టానే తప్పా.. నిన్ను బయటికి పొమ్మనలేదు’ అంటాడు కార్తీక్.

దీప సంతోషంగా:

‘మీరు ఇంకేం చెప్పొద్దు.. నాకు మీ మనసు పూర్తిగా అర్థమైంది. ఇంతకుముందు ఉండే గౌరవం రెట్టింపు అయ్యింది.. నైతిక విలువలకు ఉన్న బలాన్ని నేను బలంగా నమ్ముతాను.. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నాన్నే నేను మొదలుపెట్టాను డాక్టర్ బాబు’ అంటుంది దీప సంతోషంగా. ‘నీ ప్రయత్నంలో నువ్వు విజయం సాధిస్తే.. అందరికన్నా ముందు నేనే సంతోషిస్తాను దీపా.. కానీ..’ అంటూ ఆగుతాడు. వెంటనే పైకి లేచి.. ‘సరే.. నీ డాక్టర్ బాబుగా నేను నీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.. నీ నమ్మకమే నిలబడాలని.. నీకన్నా నేనే ఎక్కువ కోరుకుంటున్నాను.. హిమ మీద ఒట్టు’ అంటూ తన లవర్ హిమ ఫోటో వైపు చూపిస్తాడు కార్తీక్.

సీన్ కట్ చేస్తే అంజీ మోనిత తనని కొట్టడం గురించే ఆలోచిస్తూ.. ‘మోనిత కార్తీక్ బాబుని పెళ్లి చేసుకుంటే.. పెళ్లి పీటల మీదే నరికేస్తాను..’ అనుకుంటూ.. ‘ఒకసారి దీపమ్మని కలవాలి’ అనుకుంటాడు. కార్తీక్ ఇంటికి వెళ్లే సరికి.. సౌర్య అటు ఇటు తిరుగుతుంటే.. సౌందర్య సౌర్య వెనుకే నడుస్తూ.. ‘ఏంటి యువరాణీ.. మొత్తం చూస్తున్నావ్..?’ అంటే.. అప్పటికే సౌర్య దీపని తలుచుకుంటూ.. ‘నాన్నమ్మా మీకు చాలా ఆస్తి ఉంది కదా.. ఇలాంటి ఇల్లు, కార్లు చాలా ఉన్నాయి కదా.. కానీ.. అమ్మ అద్దె కట్టలేక నేను చూడకుండా చాలా సార్లు ఏడుస్తుంది. తను చీరలు కూడా చిరిగిపోయాయి’ అని బాధపడుతూ చెబుతుంది.

అప్పుడే కార్తీక్ అంతా వినడం సౌందర్య చూసి.. కోపంగా.. ‘ఆపవే’ అని అరిచి.. బాధగా.. కార్తీక్ దగ్గరకు వెళ్లి.. ‘చూడరా.. నీ భార్య నీ పిల్లలు రా.. మంచి నిర్ణయాన్ని ఇప్పటికైనా తీసుకోరా’ అంటుంది. దాంతో కార్తీక్ బాధగా సౌందర్య దగ్గరకు వెళ్లి.. తల మీద చేయి వేసి నిమురుతూ లోపలికి వెళ్లిపోతాడు.

దీప సంతోషంగా ఇంటికి వెళ్లి.. కూతురు హిమతో.. తండ్రి మురళీతో కార్తీక్‌ని కలిసి విషయం.. చాలామంచిగా మాట్లాడిన విషయం.. చెబుతుంది. దాంతో వాళ్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే.. మోనిత తనలో తనే రగిలిపోతుంది. కార్తీక్ ఫోన్ కట్ చేస్తే ఎక్కడికి వెళ్లి ఉంటాడు.. దీప, అంజీ కలిసి సౌందర్యకు విషయం చెప్పారా? వాళ్లు ముగ్గురు కలిసి కార్తీక్‌కి నిజం చెప్పారా? అని టెన్షన్ పడుతూనే ఉంటుంది. కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం గురించి తెగ కంగారు పడుతుంది.

‘దేవుడా.. దేవుడా.. ప్లీజ్ ఈ సారి ఫోన్ కలవాలి’ అనుకుంటూ.. డయిల్ చేస్తుంది. కార్తీక్ అప్పుడే స్విచ్ ఆన్ చేసి సోఫాలో కూర్చోని దీప మాటల్నే తలుచుకుంటూ ఉండగా.. మోనిత ఫోన్ మోగుతుంది. కార్తీక్ వెనుకే సౌర్య నిలబడి అంతా వింటుంది.

మోనితకి అవమానం

‘ఏంటి కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్.. ఎక్కడికి వెళ్లావ్?’ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే.. కార్తీక్ విసుగ్గా.. ‘నేను లక్ష్మమ్మ ఇంటికి వెళ్లాను.. దీప హిమ బర్త్‌డే సెలెబ్రేట్ చేసింది. అందుకే వెళ్లాను.. చాలా’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అదంతా సౌర్య వింటుంది. మోనితకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి.. ‘ఏంది కథా..? ఎక్కడైనా ఉంటుందా ఈ కథా? పెళ్లాం తప్పు చేసిందని తెలుసు.. కానీ పెళ్లాం మీద ఈగ వాళనివ్వడు. పిల్లలు తన పిల్లలు కాదనీ తెలుసు.. కానీ పువ్వుల్లో పెట్టు చూసుకుంటాడు.

మోనిత ఎన్నో దారుణాలు చేసిందని తెలుసు.. కానీ కార్తీక్ మోనితనే నమ్ముతాడు. హిమ చచ్చిందని తెలుసు.. చచ్చినదానికి పుట్టిన రోజేంటే నా బొంద.. ఆ పుట్టిన రోజుకు వెళ్లి.. కేక్ కట్ చెయ్యడం ఏంటీ నా ముఖం.. ఆ కేక్‌ని లక్ష్మమ్మ ఇంటిలో కోసి పాడెయ్యడం ఏంటి నా శార్థం.. అన్నింటికన్నా గొప్పగా.. వదిలేసిన పెళ్లాం.. చచ్చిన ప్రేయసి పుట్టి రోజును సెలబ్రేట్ చెయ్యడం ఏంటి నా పిండాకూడు.. బాబోయ్..ఏందీ ఈ కథా? ఏందయ్యా ఇది.. ఇది నేను యాడా చూడలేదు’ అంటూ రగిలిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.

Watch Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button