బుల్లితెరసినిమా
Trending

కార్తీకదీపం డిసెంబర్ 12 ఎపిసోడ్… కార్తీక్ శ్రీశ్రీ కవిత్వం..

కార్తీక్ అంతా తింటున్న సమయంలో ‘హిమకి దీపారాధన కవిత్వాలు చాలా ఇష్టమట.. కవిత్వంపై ఆసక్తి పెరిగింది.. అందుకే నాలుగురోజులు వంటలక్క ఇంటికి పంపిస్తున్నా..’ సౌందర్య భయంతో నో అంటుంది. కానీ హిమ, ఆనందరావులు నవ్వుతూ.. హ్యాపీగా ఫీల్ అవుతారు. నాలుగు రోజులే కదా అని బతిమలాడతారు. దాంతో కార్తీక్ సీరియస్‌గా.. ‘ఎవరు అవునన్నా కాదన్నా రేపు మనం వంటలక్క ఇంటికి వెళ్తున్నాం. నువ్వు నాలుగురోజులు ఉంటున్నావ్’ అంటాడు కూల్‌గా..

అదే గుర్తు చేసుకుంటూ ఆదిత్య, శ్రావ్యలు మాట్లాడుకుంటారు. ‘కచ్చితంగా అన్నయ్య ఏదో ప్లాన్‌లో ఉన్నాడని అర్థం అవుతుంది..’ అంటాడు ఆదిత్య. ‘అవును కచ్చితంగా ఏదో చెయ్యబోతున్నారు.. నాకేదో భయంగా ఉంది ఆదిత్య..’ అంటుంది శ్రావ్య. ‘హిమ డాడీ అని పిలిస్తే తట్టుకోలేకపోయాడు.. హిమని వదిలిపెట్టి ఉండలేకపోయిన అన్నయ్య.. వదిన దగ్గరకు ఎలా పంపుతున్నాడు..?’ అంటాడు శ్రావ్యతో ఆదిత్య. ‘నువ్వు గమనించావా? ఆయన మాటల్లో కవిత్వం అనే మాట చాలా సార్లు వినిపించింది.. మా అక్కకి బావగారికి మనస్పర్థలు ఏర్పడిందే అక్కడ.. దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా?’ అంటుంది శ్రావ్య అనుమానంగా.. ‘అంత దూరం ఆలోచించకు.. ఏదైనా జరిగితే హిమ దరపున మనం ఉంటాం కదా..’ అంటాడు ఆదిత్య.

Karthika Deepam

సీన్ కట్ చేస్తే.. అదే విషయాన్ని దీపకి సౌందర్య ఫోన్ చేసి చెబుతుంది. దాంతో దీప సౌర్యతో.. ‘మీ నాన్న హిమని రేపు మనింటికి తీసుకొస్తున్నారట..’ అంటుంది టెన్షన్‌గా. దాంతో సౌర్య.. ‘అవునా మరి నువ్వు హ్యాపీగా లేవేంటి? హిమ రావడం నీకు ఇష్టమే కదా?’ అనడంతో దీప తనలో తనే మదనపడుతుంది. ‘ఆ మనిషే హిమని తీసుకుని రావడమేంటి?’అనుకుంటూ కంగారు పడుతుంది. సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయం.. ఆనందరావుకు టీ తీసుకుని వెళ్లిన సౌందర్య.. ‘ఈ మధ్య ఆ మౌనిత జోక్యం ఎక్కువైపోయింది. అదేం నూరిపోసిందో.. వీడు దాన్ని ఎందుకు తీసుకుని వెళ్తానంటాడో అని భయంగా ఉంది..’ అనడంతో.. ఆనందరావు ‘నువ్వు కంగారుపడకు సౌందర్య.. ఏం కాదు’ అంటూ సద్దిచెబుతాడు.

మౌనిత దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తూ.. ‘కార్తీక్‌కి హిమ దీప కూతురే అని తెలిసేలా చెయ్యి స్వామీ..’ అని మొక్కుకుంటుంది. సీన్ కట్ చేస్తే హిమని తీసుకుని కార్తీక్ బ్యాగ్ పట్టుకుని కిందకు దిగుతుంటే.. సౌందర్య, ఆనందరావు, ఆదిత్య, శ్రావ్యలు చాలా డల్‌గా కనిపిస్తారు. దాంతో కార్తీక్ కూల్‌గా నవ్వుతూ.. ‘ఏంటి అందరూ అంత విషాదంగా చూస్తున్నారా..? హిమని హాస్టల్‌కో అడవులకో పంపట్లేదు.. మీరేం టెన్షన్ పడకండి..’ అంటాడు. అయినా అంతా డల్‌గానే ఉండటంతో.. బ్యాగ్ కింద పెట్టి.. ‘మీకేం అర్థం కావట్లేదు కాదు..’ అంటూనే అద్భుతమైన శ్రీశ్రీ కవిత్వం అందుకుంటాడు.

శ్రీశ్రీ కవిత్వం:

‘భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్యగీతాన్ని నేను! స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదికముందు అస్రనైవేద్యం! లోకాలు, భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు! నా ఊహ చాంపేయమాల! రస రాజ్యడోల! నా ఊళ కేదారగౌళ! గిరులు, సాగరులు, కం కేళికా మంజరులు, ఝరులు నా సోదరులు! నే నొక దుర్గం! నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం..’ అంటూ అద్భుతంగా చెబుతూ.. సౌందర్య, ఆనందరావులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాడు.

అర్థం కాక అయోమయంలో ఉన్న సౌందర్యతో.. ‘శ్రీ గారి ఐ కవిత.. చాలా బాగుంటుంది.. నా కూతురిలో సాహిత్యంపై అభిరుచి బాగా పెరిగింది.. ’ అంటాడు కూల్‌గా కార్తీక్. ‘అది నేర్చుకున్న నాలుగు లైన్ల కవిత్వానికి ఇంత చేస్తున్నావెందుకురా.. అదేం కవయిత్రి కావాలని కలలు కనలేదురా..’ అంటుంది సౌందర్య టెన్షన్‌గా.. ‘ఆ అభినేత్రి తలుచుకుంటే దీన్ని కూడా కవయిత్రిని కూడా చెయ్యగలదు మమ్మీ..’ అంటాడు కార్తీక్ అంతే కోపంగా. ‘రేయ్.. ఏదైనా చేసేప్పుడు పెద్దవాళ్లం మేము ఉన్నాం.. మాతో చర్చించాలని నీకు తెలియదా?’ అంటాడు ఆనందరావు. ‘అయ్యో.. మీ పెద్దరికాన్ని చిన్నరికంగా చూడట్లేదు డాడీ..’ అంటాడు కార్తీక్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button