బుల్లితెరసినిమా
Trending

హిమని కలుసుకున్న డాక్టర్ బాబు.. ‘కార్తీకదీపం’ 1000వ ఎపిసోడ్ సూపర్ ట్విస్ట్..

మురళీ కృష్ణ దీప గురించి తన భార్య కి కూడా చెప్పలేదు అని తెలుసుకుని అనడపడుతుంది మోనిత, హిమ గురించి సౌందర్య వాళ్ళకి కూడా చెప్పలేదు. ఇంతకీ కార్తీక్ ఏమయ్యాడు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తుంది.

కార్తీక్ ఒక హోటల్ లో టిఫిన్ తింటూ శౌర్య ని తలుచుకుని బాధపడుతుంటారు. ఇంతలో సౌందర్య ఫోన్ చేస్తోంది. చెప్పు మమ్మీ అంటాడు. ఎక్కడున్నావ్ రా ఏమయిపోయావ్, రాత్రి కూడా ఇంటికి రాలేదు అని కాగారుపడుతుంది. కనీసం టిఫిన్ తిన్నావా అని ఆరా తీస్తుంది. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను, కొంచెం టైం పొందుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

కార్తీక గురించి తలుచు కుని కంగారుపడుతుంటారు సౌందర్య ఆనందరావులు. ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. నేను మీతో గొడవ పెత్తుకోవటానికి రాలేదు, కార్తీక్ న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. లేదు, ఎక్కడున్నాడో తెలియదు అని చెప్తాడు ఆనందరావు. సరే అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది మోనిత.

టిఫిన్ సెంటర్ ముందు చాలా మంది కస్టమర్స్ ఉంటారు. వారణాసీ ఓ పక్కన మురళీ కృష్ణ మరో పక్కన పని చేస్తూ ఉంటారు. అక్కడున్న ఓ కస్టమర్ తింటూ తింటూ.. ‘పాపా ఎంతసేపమ్మా.. చట్నీ త్వరగా తీసుకునిరా..’ అంటాడు హిమతో కోపంగా. సరే అంటూ హిమ చట్నీ గిన్నె తీసుకుని అతడి దగ్గరకు వెళ్తుంటే.. ఓ చెయ్యి తనని ఆపుతుంది. ఎవరా అన్నట్లు తలతిప్పితే కార్తీక్…

పాపిట్లో సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది అద్దంలో చూసుకుంటూ. అది గమనించిన సౌర్య.. తల్లికి ఆరెంజ్ జ్యూస్ తీసి ఇస్తూ.. ‘ఇప్పుడు ఆ కుంకుమ పెట్టుకోకపోతే ఏం అయ్యింది?’ అంటుంది కోపంగా. వెంటనే దీప ఎమోషనల్‌గా.. ‘నీకేం తెలుసు ఈ పాపిట సింధూరం గురించి.. ఈ కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా.. మీ నాన్న నా పక్కనున్నట్లే ఉంటుంది..’ అంటుంది.

సీన్ కట్ చేస్తే..

కార్తీక్ ఎమోషనల్‌గా హిమ కళ్లల్లోకి చూస్తూ.. హిమ చేతిలోని చట్నీ గిన్నె తీసుకుని.. ఆ కస్టమర్‌కి తనే చట్నీ వేస్తాడు. కార్తీక్ ని చూసి కంగారుగా మురళీ కృష్ణ దగ్గరకు వెళ్తుంది హిమ. ఏమైందమ్మా అంటాడు మురళీ కృష్ణ… నాన్న అని కార్తీక్ ని చూపిస్తుంది.. మురళీ కృష్ణ షాక్ అయ్యి అలానే ఉండిపోతాడు..

రేపటి ప్రోమోలో..

హిమానీ తీసుకుని ఇంటికి వస్తాడు డాక్టర్ బాబు.. అదేసమయానికి దగ్గుతూ ఇంటి బయటకి వస్తుంది దీప. ఏమైందమ్మా అని కంగారుగా దీప దగ్గరకి వెళ్తుంది హిమ. నాన్న వచ్చాడమ్మా అని కార్తీక్ ని చూపిస్తుంది. మసక బారిని కళ్ళతో.. కార్తీక్ని చూసి, ఏడుస్తూ డాక్టరబాబుని హత్తుకుంటుంది దీప. తరవాత ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే…

Watch 2021 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button