
కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడని చాలా వార్తలు వినిపించాయి, అయితే అవి నిజం కాదని చాలామంది అనుకున్నారు. అవన్నీ వాస్తవాలేనని రుజువుచేస్తు ప్రభాస్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ షేర్ చేసారు.

Prabhas in Salaar
ఈ సినిమా టైటిల్ Salaar అని ఖరారు చేసారు. ఈ సినిమా 2021లో సెట్స్ పైకి ఎక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాని 2022 లో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఉగ్రమ్ మూవీతో తన కెరీర్ స్టార్ట్ చేసి, కెజిఫ్ తో విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఫ్ 2 షూటింగ్లో ఉండగా, అది ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో అనౌన్స్ చేసి, అందరి ద్రుష్టి ని తన వైపు తిప్పుకున్నారు.

అయితే ఈ సినిమా కి విజయ్ కిరాగండూర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, Hombale Films బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చిత్రబృందం, ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ ప్రకటించారు
#Prabhas in #SALAAR THE MOST VIOLENT MEN.. CALLED ONE MAN.. THE MOST VIOLENT!!
ప్రస్తుతం ప్రభాస్, రాధేశ్యామ్ మూవీ షూటింగ్ లో బిజీగ ఉండగా, ఓం రౌత్ దర్శకత్వం నిర్వహిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ మొదలుకావలిసి ఉంది. ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకుంటుండగా ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.


అయితే రీసెంట్ గ, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా, ప్రభాస్ తో ఒక సినిమా అనౌన్స్ చేసారు. దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు

‘సలార్’గా వస్తోన్న రెబల్ స్టార్ ముందు ఒప్పుకున్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. పాన్ ఇండియా స్టార్ గ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన కెరీర్లో హాలీవుడ్ రేంజ్ కి ఎదగాలని కోరుకుంటూ, అల్ ది బెస్ట్ ప్రభాస్.