
టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా రూపొందుతున్న న్యూ మూవీ ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడం విశేషం. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని తాజాగా మహేష్ బాబు రిలీజ్ చేశారు.
అడవిశేష్ పుట్టిన రోజు కానుకగా ఈ లుక్ విడుదల చేసిన మహేష్ బాబు.. ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అడవిశేష్ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ‘మేజర్’ ఒకటిగా నిలుస్తుందని అన్నారు. ఇక మహేష్ బాబు విషెస్ అందుకున్న అడవిశేష్.. ”థాంక్యూ సూపర్ స్టార్. మీ అంచనాలను అందుకునేలా రాబోయే వేసవిలో రంగంలోకి దిగుతాం. మేజర్ సినిమాకు గాను మీరు ప్రోత్సాహక మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. అదేవిధంగా నమ్రత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని పేర్కొన్నాడు.