టాలీవుడ్సినిమా
Trending

మెగా వెడ్డింగ్ కార్డ్… @ నిహారిక ❤️ చైతన్య

డిసెంబర్ 9వ తేదీన నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే వారి వెడ్డింగ్ కార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. ప్రస్తుతం నిహారిక పెళ్లి సంగతులు, నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

వీరి వివాహం, ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరగనుంది. అంతేకాదు, ఈ నెల 11న హైద్రాబాద్లో వీరి రెసిపేషన్ కూడా ప్లాన్ చేసారు. ఈ వేడుక JRC కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.

Wedding Card – వెడ్డింగ్ కార్డ్

కొరోనా నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ రెండు వేడులకు జరగనున్నాయి. కాగా, పెళ్లికి మాత్రం, టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు అటెండ్ కావడంలేదని ప్రచారం జరుగుతుంది. వీరందరూ, రెసెప్షన్లకి అటెండ్ అవుతారని వినికిడి. పెళ్లికిమాత్రం, కేవలం రెండు కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు హాజరు కానున్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిని, మెగా వారసుడు, వరుణ్ తేజ్ దగ్గరుండి పర్యవేక్షితునట్లు సమాచారం. అయితే, నిహారిక మాత్రం, ఫ్రెండ్స్ అండ్ ఫామిలీకి బాచిలర్ పార్టీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే, మెగా సిస్టర్స్ ఒక పార్టీ జరుపుకోగా, నిహారిక, తనకు కోబోయే భర్త చైతన్యతో కలిసి ఫ్రెండ్స్ కి ఒక పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Party With Mega Sisters

Bride To Be Niharika Konidela

Niharika Konidela with her Friends

Wedding Invitation

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button