ఆంధ్రప్రదేశ్వార్తలు
Trending

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు శస్త్ర చికిత్స

ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శస్త్ర చికిత్స జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఐసీయూ నుంచి నేడు వార్డుకు తరలించారు. ఈ క్రమంలో మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్‌ విడుదల చేశారు. 

నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు.. ఆరోగ్య పరిస్థితిపై భర్త సెల్వమణి క్లారిటీ

ఈ మేరకు ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుటపడుతోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆదివారం రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని, 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు.

Watch 2021 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button