తెలంగాణవార్తలు
Trending

Corona Cases in Telangana

తెలంగాణ కరోనా: కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 150 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 1,939 యాక్టివ్ కేసులు ఉండగా..2,92,032 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 1610కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 186 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కొత్తగా జీహెచ్ఎంసీలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కొవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. అవన్నీ రెండు డోసుల టీకాలే. దాదాపుగా అన్ని వ్యాక్సిన్లు 28 రోజుల వ్యవధిలో రెండో డోసును తీసుకోవాల్సి ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండో డోసు తీసుకున్న తర్వాత కరోనా వైరస్ నుంచి 90 శాతం రక్షణ లభిస్తుంది. కొన్ని ఫార్మా సంస్థలు సింగిల్ డోసు వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. అందులో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సంస్థ గుడ్ న్యూస్ అందించింది.

కొవిడ్‌ మరణాల నుంచి తమ టీకా 100 శాతం రక్షణ కల్పిస్తుందని జాన్సన్ & జాన్సన్ తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల్లోనే వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది. యూఎస్‌లో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్సన్ & జాన్సన్‌ అందించిన సమాచారం పరిశీలించి టీకా అనుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ డిసెంబర్ నుంచే టీకాలు అందిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్, మోడెర్నా వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వినియోగం కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంది. జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సంస్థ వ్యాక్సిన్‌ ఒకే డోసు సరిపోతుంది. అంతేకాకుండా దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండటం మరో విశేషం.

Watch 2020 Telugu Full Movies Streaming Online on OTT Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button