బుల్లితెరసినిమా
Trending

అందుకే సిటీకి దూరంగా.. బిగ్‌బాస్‌కు నోయ‌ల్ షాక్‌.. !

సిటీకి దూరంగా రాష్ట్రసరిహద్దుల్ని దాటేంత దూరంగా ఇళ్లుని కొని అక్కడకు వెళ్లిపోయాడు నోయల్. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్న నోయల్.. ‘మనుషుల్ని ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండటం మంచిది.. ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదం అని అర్థమైంది’ అంటూ పూర్తి వైరాగ్యంలో ఉన్నట్టుగా మాట్లాడారు.

బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డం మాటేమోగానీ, కంటెస్టెంట్‌లో మాత్రం వైరాగ్యాన్ని నింపింది. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4 చివ‌రి ద‌శకు వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ‌, నోయ‌ల్ మ‌ధ్య‌లోనే బ‌య‌టికొచ్చిన విష‌యం తెలిసిందే. త‌న మిత్రురాలైన హారిక‌ను గెలిపించాల‌ని అత‌ను కోరుతున్నాడు. ఇక త‌న‌కు పాపులారిటీ తెచ్చిన బిగ్‌బాస్ రియాల్టీ షో గురించి త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పాడు. బిగ్‌బాస్ షో మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని అర్థ‌మైంద‌ని షాకింగ్ మాట చెప్పాడు. అస్స‌లు ఆ షోకు తాను ఎందుకెళ్లానో, ఏమో అనే ఫీలింగ్ బాధ పెడుతున్న‌ట్టు చెప్పాడు. దీంతో ఆ షోను పూర్తిగా చూడ‌డ‌మే మానేసిన‌ట్టు నోయ‌ల్ చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Noel Bigg Boss Telugu 4
Noel Bigg Boss Telugu 4

ఈ విషయాన్ని పక్కనపెడితే.. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన నోయల్.. మళ్లీ తిరిగి వెళ్తానని.. ఈసారి ఇరగదీస్తానని పోస్ట్‌లు పెట్టాడు. అయితే నోయల్ రీ ఎంట్రీ ఆశలు ఫలించలేదో.. లేదంటే నిజంగానే బిగ్ బాస్ షోపై ఇంట్రస్ట్ పోయిందో తెలియదు కానీ తాజాగా బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా అభిజిత్, హారికలు కూడా ఒకర్నొకరు నామినేట్ చేసుకున్నారు. ఫ్రెండ్ షిప్‌కి స్టాండ్ తీసుకుని హారిక సేవ్ చేసింది. మనం రోజూ చూసే నేచర్‌లోనే మంచి ఉంది. చెట్లు పక్క పక్కనే ఉంటాయి.. ఒక చెట్టు పడిపోతుంటు పక్కనున్న చెట్టు వేళ్లు పడిపోకుండా పట్టుకుంటాయి. హారిక 8 సార్లు కెప్టెన్సీ టాస్క్‌లో ఉండటం అనేది చిన్న విషయం కాదు.. ఫైనల్ స్టేజ్‌లో కెప్టెన్ అయ్యి బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంది. హారికకు సపోర్ట్ లేదు.. మోనాల్ సపోర్ట్ చేయడంతో కెప్టెన్ అయ్యింది. హౌస్‌ని కంట్రోల్‌లో పెట్టింది. ఆమె దగ్గర డ్రామాలు ఉండవు.. స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. మనుషుల్ని వాడుకుని గేమ్‌లు ఆడి.. టైటిల్ కొట్టాలి.. రూ.50 లక్షలు కొట్టాలి.. వాడేమైపోతే ఏంటి.. వీడేమైపోతే ఏంటి?? అన్నట్టుగా గేమ్ ఆడట్లేదు హారిక. చాలా జన్యూన్‌గా గేమ్ ఆడుతోంది. నూటికి నూరు శాతం హారిక టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఎలాంటి ట్రాక్స్ లేవు. లవ్ ట్రాక్‌లు బేస్ చేసుకునో.. కామెడీ ట్రాక్‌ని బేస్ చేసుకునో ఆమె ఇక్కడ వరకూ రాలేదు.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ హారిక:

అభిజిత్ విషయంలో హారిక చేసింది నాకైతే తప్పని అనిపించలేదు. హారికకు నేను ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే.. ఆమె చాలా ఇబ్బందులు పడి ఇక్కడ వరకూ వచ్చింది. జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న హారిక.. గేమ్‌ని కూడా అంతే కష్టపడి ఆడుతోంది. అందుకే సపోర్ట్ చేయండి.. ఈసారైనా బిగ్ బాస్ టైటిల్ అమ్మాయికి వచ్చేలా సపోర్ట్ చేయండి’ అని ప్రేక్షకుల్ని కోరాడు నోయల్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button