టాలీవుడ్సినిమా
Trending

సల్మాన్ ఖాన్ యునైట్ విత్ రామ్ చరణ్

దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ తదుపరి చిత్రం దానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌తో ట్రెండింగ్లో ఉండగా, ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై సంతకం చేయాలనుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయి. కాగా, కథానాయికగా కియారా అద్వానీ ఖరారైనట్లు వార్తలు ఉన్నాయి.

ఓ వైపు తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR చేస్తూనే మరోవైపు ఇతర ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. హీరోగా, నిర్మాతగా మెగా అభిమానులను ఫిదా చేస్తున్నారు. ప్రెసెంట్ రాజమౌళి రూపొందిస్తున్న RRR తో పాటు తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య‘ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న చెర్రీ.. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. చెర్రీ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై శంకర్ సీరియస్ స్కెచ్ వేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్‌ కేటాయించి దిల్ రాజు ఈ మూవీ తెరకెక్కించబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా రానున్న నేపథ్యంలో అత్యంత స్పెషల్‌గా ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఎప్పటికప్పుడు దర్శకుడు శంకర్‌తో డిస్కషన్స్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. అలాగే ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చెన్నైలో ప్రత్యేకంగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారట దిల్ రాజు. అన్ని వసతులతో కుడి చిత్రయూనిట్ మీట్ కావడానికి, సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ పెట్టుకోవడానికి అనువుగా ఉండేలా ఈ ఆఫీస్ డిజైన్ చేయిస్తున్నారని సమాచారం.

Watch Telugu Full Movies Streaming Online on OTT Platform

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button