అంతర్జాతీయంవార్తలు
Trending

ట్రంప్ పాలనలో భారీగా సంపాదించింది వీరే!

అగ్రరాజ్యం అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. అయితే ట్రంప్ పాలనలో బిలియనీర్లు పండుగ చేసుకున్నారు. ఎందుకంటారేమో.. వీరి సంపద భారీగా పెరిగింది. 2016 నుంచి అంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చూస్తే.. ఎక్కువ డబ్బులు సంపాదించింది ఎవరనే జాబితాను ఫోర్ట్స్ వెల్లడించింది. దీని ప్రకారం..

అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ ఈ జాబితాలో టాప్‌లో ఉన్నారు. ఈయన సంపద విలువ 189 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలో వచ్చిన దగ్గరి నుంచి ఈయన సంపద విలువ ఏకంగా 121 బిలియన్ డాలర్లు పెరిగింది. తర్వాతి స్థానంలో ఎలాన్ మాస్క్ ఉన్నారు. స్పెస్ ఎక్స్, టెస్లా బాస్ అయిన ఈయన సంపద విలువ 90 బిలియన్ డాలర్లు. 2016 నుంచి ఈయన సంపద విలువ 79 బిలియన్ డాలర్లు పెరిగింది.

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మర్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 73 బిలియన్ డాలర్లు. 2016 నుంచి చేస్తే ఈయన సంపద విలువ 44 బిలియన్ డాలర్లు పెరిగింది. నాలుగో స్థానంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఈయన సంపద విలువ 99 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఈయన సంపద విలువ 44 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఐదో స్థానంలో క్వికెన్ లోన్స్ ఫౌండర్ డాన్ గిల్బర్ట్ ఉన్నారు. ఈయన సంపద విలువ 44 బిలియన డాలర్లు. 2016 నుంచి ఈయన సంపద విలువ 39 బిలియన్ డాలర్లు పెరిగింది. బిల్‌గేట్స్ ఆరో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 117 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఈయన సంపద విలువ 35 బిలియన్ డాలర్లు పెరిగింది.

వాల్‌మార్ట్‌కు చెందిన ఎలైస్ వాల్టన్ సంపద విలువ 67 బిలియన్ డాలర్లు. ఈమె ఏడో స్థానంలో ఉన్నారు. ఈమె సంపద విలువ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి 33 బిలియన్ డాలర్లు పెరిగింది. వాల్‌మార్ట్‌కు చెందిన జిమ్ వాల్టన్ 8వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 32 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇప్పుడు ఈయన సంపద 67 బిలియన్ డాలర్లు. ఇక వాల్‌మార్ట్‌కు చెందిన రాబ్ వాల్టన్, ఒరాకిల్ కోఫౌండర్ లారీ ఎల్లిసన్ 9, 10 స్థానాల్లో ఉన్నారు. వీరి సంపద విలువ వరుసగా 32 బిలియన్ డాలర్లు, 30 బిలియన్ డాలర్లు పెరిగింది.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button