టాలీవుడ్సినిమా
Trending

విశ్వక్ సేన్ ‘పాగల్’ ఫస్ట్‏లుక్ రిలీజ్..

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం ‘పాగల్‌’. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేథా పేతురాజ్‌ నాయిక. తాజాగా విశ్వక్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తూ చిత్ర విడుదల తేదీనీ ప్రకటించింది చిత్రబృందం. ఇందులో కళ్లద్దాలు పెట్టుకుని, పూల చొక్కా ధరించి ట్రెండీ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏప్రిల్‌ 30న మీ హృదయాలు దోచుకునేందుకు పాగల్‌ రాబోతున్నాడని ట్వీట్‌ చేసింది నిర్మాణ సంస్థలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌. హీరోగా విశ్వక్‌కి ఇది 5వ సినిమా…

తాజాగా విడుదలైన పోస్టర్‏లో విశ్వక్ సేన్ కూల్ లుక్‏లో కనిపిస్తున్నారు. అలాగే మూవీ పోస్టర్ కూడా ఆహ్లదకరంగా చుట్టూ.. లైట్ పింక్ గులాబీ పువ్వులతో క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.

Watch Vishwaksen Naidu Telugu Full Movies Streaming Online on ott Platforms

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button