
అప్పటివరకు మోగుతున్న యూట్యూబ్ స్క్రీన్ మీద సాయంత్రం ఐదు గంటలకు కోతి బొమ్మ వచ్చి కూర్చుంది. మెయిల్ చేద్దామని చూస్తే Temporary error అంటూ ఓ మెసేజ్ వచ్చింది.
అదేంటి మీకూ ఈ సమస్య వచ్చిందా అనకండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి సమస్య వచ్చింది. సుమారు గంటసేపు ఈ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గూగుల్‌కు చెందిన ప్రధానమైన సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, డాక్స్, ఫొటోస్, కాంటాక్ట్స్, హ్యాంగ్అవుట్స్ ఇలా గూగుల్ ప్రోడక్ట్స్ సేవలు నిలిచిపోయాయి.
అయితే గంట తర్వాత కూడా కొన్ని దేశాల్లో ఈ సమస్య కొనసాగింది. గూగుల్ ఉత్పత్తులు ముఖ్యంగా జీమెయిల్, యూట్యూబ్ డౌన్ కావడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఈ రోజూ అదే జరిగింది. ఐదు గంటల ప్రాంతంలో ఒక్కొక్కటి సర్వీసులు నిలిచిపోతూ వచ్చాయి.
ఈ ప్రభావంతో సుమారు 150 కోట్ల మంది ఇబ్బంది పడుంటారని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిన నేపథ్యంలో ట్విటర్ అంటూ వరుస ట్వీట్లు పెట్టారు. గూగుల్ సర్వీసులు తిరిగి మొదలయ్యాక కూడా ట్వీట్ల తాకిడి కొనసాగింది. ఈ విషయాల్ని తెలుపుతూ కొందరు నవ్వులు పూయించే మీమ్స్‌ను ట్వీట్ చేశారు. కొంతమంది ‘ఇది యుగాంతం’, ‘2020లో ఇది కూడా’ అంటూ సరదా కామెంట్లు చేశారు. వాటిని దిగువ చూడొచ్చు.